ఆది దంపతూలుఆదిదంపుతులిట్లునరుదెంచినారోయివాగర్థములరీతి వరములొసగబాలేందుధరుడిట్లు పార్వతీమాత తోకైలాసగిరినుండి కదలివచ్చివిజ్ఞాన శాస్త్రాల వివరాల వర్ణించిమానవ ధర్మాన్ని మనకు తెలిపిజ్ఞాన భిక్షనొసగకదలివచ్చిరిపుడువ్రతకథలెల్లను వరణీయమౌరీతిపుణ్యాలరాశిని భువికి నొసగఅందించినారయ్య యాదరానపార్వతమ్మ తల్లి పాలించుచుండగాకొరత యేమి కలుగు కువలయానభవుని భక్తులెల్ల బంధుజనులుకాగకొరుతయేమి కలుగు కువలయాన(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

ఆదిదంపుతులిట్లునరుదెంచినారోయి
వాగర్థములరీతి వరములొసగ
బాలేందుధరుడిట్లు పార్వతీమాత తో
కైలాసగిరినుండి కదలివచ్చి
విజ్ఞాన శాస్త్రాల వివరాల వర్ణించి
మానవ ధర్మాన్ని మనకు తెలిపి
జ్ఞాన భిక్షనొసగకదలివచ్చిరిపుడు
వ్రతకథలెల్లను వరణీయమౌరీతి
పుణ్యాలరాశిని భువికి నొసగ
అందించినారయ్య యాదరాన
పార్వతమ్మ తల్లి పాలించుచుండగా
కొరత యేమి కలుగు కువలయాన
భవుని భక్తులెల్ల బంధుజనులుకాగ
కొరుతయేమి కలుగు కువలయాన
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత