అతడొకడు కలడు

అతడొకడుకలడునందరిలోకలడు
అతడులేకుండినయసలులేదు
ఇసుకరేణవునుండియింద్రలోకమువరకు
అతడులేకుండినయసలులేదు
పర్వతమును నుండి పరమాణు వరకుండు
అతడులేకుండినయసలులేదు
చీమలోనతడుండుశివునిగాతానుండు
అతడులేకుండినయసలులేదు
అంతటాతానుండునందరైతానుండు
అతడులేకుండినయసలులేదు
అతడొకడుండినయందరూనున్నట్లె
అతడులేకుండినయసలులేదు
వెలుతురైతానుండువెలుగులోతానుండు
వెదుకిచూడదగునె వెర్రిగాను
ప్రణవస్వరూపియై పరమాత్మ రూపమై
అంతటాతానున్ననాత్మయతడె
ఆ.వె.
హృదయకమలమందు హృషికేశుడతడు
మనసులోననున్న మాధవుండు
శక్తియుక్తిడైన శంకరుడతడోయి
పరమతత్త్వమైన బ్రహ్మమతడె
(రచన:-విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత