సంస్కృతి అనువాదం

*పీత్వా కర్దమపానీయం
భేకో రటరటాయతే।
పక్వం చూతరసం పీత్వా
గర్వం నాయాతి కోకిలః ॥*

భేకమొకటి తాను బెకబెకలాడును
మడుగు బురద త్రాగి మదముచెంది
చూత రసముగ్రోలి సుస్వరమొప్పగా
కోకిలమ్మ పాడు గొప్పగాను

అనంత శాస్త్రం బహువేదితవ్యం
అల్పశ్చకాలో  బహవశ్చవిఘ్నః
యత్ సారభూతం తదుపాసితవ్యం
హంసోయథా క్షీరమివాంబు మిశ్రం

విపులమైనవోయి విజ్ఞాన శాస్త్రాలు
చదవదగినవేవొ చాలకలవు
కాలమల్పమాయె కలవెన్నొ విఘ్నాలు
సారమొరుగు హంస సామ్యమొట్లు

*పణ్డితే చ గుణాస్సర్వే మూర్ఖో దోషాశ్చ కేవలమ్।
తస్మాన్మూర్ఖసహస్రేభ్యః ప్రాజ్ఞ ఏకో విశిష్యతే
॥*విబుధవరలకుండువేలాది గుణములు
మొరకువానికుండు మూర్ఖ మొకటె
మూర్ఖ జనులు జగతి వేలాది గా నుండ
జ్ఞాన యెకడె వెలుగు జగతిలోన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత