హాస్యం

నిజజీవితంబున నిండైన హాస్యంబు
నీకిచ్చు యైంతైన నిమ్మళంబు
హాస్యమే లేకున్న యంతరించునుకాదె
ఆరోగ్య భాగ్యంబు నపుడె మనకు
నవ్వించు కళయున్న నవనవోన్మేషమౌ
బ్రతుకంత మనకింక పండగౌను
స్మితముఖముచూపు చిన్నారి నవ్వులో
హాస్యాధి దేవత యాడుకొనును
నవరసాలందున నవ్వుకే
మనవారు
అగ్రాధి పత్యంపు హక్కునివ్వ
ఆ.వే.నవ్వ వలయు నీవు  నవ్వించు జగతిని
ఇదియె  ధర్మ మయ్య యిలను మనకు
సుముఖడిచ్చె మనకు సుస్మిత వదనమ్ము
నవ్వులేని  వాడు నరుడు కాడు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత