హరిహారాద్వైతము

హరిహరులీరువురుయరుదెంచి రీరితి
ఉభయలొకటియంచు నుర్వికెల్ల 
శివునిహృదయసీమ శ్రీహరి వాసమ్ము
శ్రీహరి మదిలోన శివుడుకొలువదీరు
వాసుదేవుడతడు వామదేవుడితడు
అతనికితనికంత యావంత బేధమ్ము 
చూపరాదు జనులుచూడరాదు
రామనామమహిమ రజితాద్రి వాసుండు
పార్వతీమాతకు బయలు పరచె
పంచాక్షరీ జప పారమ్య మొరిగిన
పార్థసారథికన్న ప్రబలు లెవరు
ఆ.వే.శివుని పూజ నొసగు చిత్తశుధ్ధియెపుడు
హరిని పూజచేయ యఘము బాయు
భజన చేయ వలయు భక్తితో మనమంత
మనకు లభ్య మాయె మనుజ జన్మ
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)
హరిహరాద్వైతమేయమృతమయతకూర్చు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత