మేధావులు
మేధావు లనిపేరు మేకవన్నెపులులు
సామ్యవాదమనుచు చచ్చు చర్చ
వంచన కళలోన పంచమాంగదళము
దేశహితులుకాని దేభ్యసములు
ఇసుమంత దేశాన్ని యిష్టపడనివీరు
వీధినాటకమలాడ వీరులోయి
మసిపూయుకళలోనమడమతిప్పరోయి
తాలిబానులెల్లరుతాపసోత్తములంచు
బాణీలు కట్టుచుపాడగలరు
చీనిదేశమనగానె చీనీమిఠాయిరా
భారతదేశమనిన పడనెపడదు
మార్క్సుమావోలతో మమతానుబంధమ్ము
ఏడుజన్మల బంధమో యెరుకలేదు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి