ఉపాధ్యాయునిగా నావిద్యక్త ధర్మము

తరగతి ఉపాధ్యాయునికన్నా తెలుగు హిందీ పండితుల పని సౌకర్యవంతంసామాన్యంగా.తెలుగు హిందీ టీచర్లకు క్లాస్ టీచర్ షిప్ ఇవ్వరు. ఎందుకో వారాపని పట్ల ఆసక్తికనపరచరని నమ్మకము కావచ్చు.
అదే నాకు లాభించింది.ప్రోగ్రెస్ రికార్డ్ లు,అటెండెన్స్ రిజిష్టర్ జంజాటముండదు. విద్యార్థుల కులమతాలు తెలుసుకొనే ఆవశ్యకత అంతకన్నా వుండదు.పాఠం ప్రారంభించే ముందు వారి ముఖారవిందాలను ప్రసన్నం చేసుకొని వినేట్లు చేసుకొంటే చాలు.వారిలో దాగున్న నైపుణ్యాలను గుర్తించుకొని, వ్యాసరచనో,వక్త్తృత్వమో,నాటకాభినయమో, పద్యపఠనమో దేనికి ఉపయోగపడతారో అని జల్లెడ పట్టి అందుకు తగిన శిక్షణకు ఉపయోగపడేది .ఏదో ఒక నైపుణ్యం లేకుండా భగవంతుడు ఎవరినీ సృష్టించడు.ఉపాధ్యాయుడు ఆనైపుణ్యాన్ని గుర్తిస్తే ,ఆ విద్యార్థి లో నైపుణ్యాన్ని పెంచడమే కాక ,వారిలో అనంతమైన ఆత్మవిశ్వాసాన్ని పెంచిన వారమవుతాము.ఇది నా విద్యార్థి జీవితంలోను, ఉపాధ్యాయ జీవితంలోను అక్షరసః జరిగింది.తరువాతి వారి భవిష్యత్తుకు ఆధారమైనా విచిత్రం కాదు.
కేవలం విద్యార్థుల తల్లిదండ్రుల వృత్తివ్యావృత్తులను తెలుసుకోవడానికి వారితో సంప్రదించడానికి ఉపయోగ పడేది.
స్వామీ రంగనాథానందులు చెప్పినట్లు infinite possibilities (అనంతమైన అవకాశాలు) విద్యార్థి లో దాగివుండవచ్చు.మర్రివిత్తనం చిన్నదే కానీ వేలయెకరాలు ఆక్రమించే వటవృక్షమ వుతుంది.అలానేవిద్యార్థుల భావితరానికి ఉపయోగం పడేట్లుతయారు చేయడానికి ఉపాధ్యాయుల బాధ్యత ఎంతో వుంది.వుంటుంది.
దేశభవిష్యత్తు వారి చేతుల్లోనే వుంది.manmaking, charector building, assimilation of ideas వ్యక్తిత్వం నిర్మాణము,శీల నిర్మాణము,ఉన్నత భావాలు ప్రోది‌చేయడమే విద్యయొక్క ముఖ్యలక్షణము అనే స్వామీ వివేకానంద సూక్తి నాకు స్పూర్తి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత