అసుతోషు సేవ
అనునిత్య మీరీతి నషుతోష సేవను
ఆర్ధ్రతాభావాన ననుసరించి
అమరేశు భక్తుల నాశిస్సు లెల్లను
పూర్వపుణ్యంబుగా పొడిమె మీకు
తనదుభక్తులనెల్ల తమవారిగా చూచేటి
భాగ్యంబుమీకింక ప్రాప్తమయ్యె
వీరసైనికులార వీరభక్తియెపుడు
శ్రీరామ రక్షగా రక్షసేయు
ఉగ్రవాదమెపుడు నుర్వికి భారంబు
సమయజేయ వలయు సత్వరంబు
ప్రమథ గణము లట్లు ప్రళయాగ్ని కురిపించి
విజయమంద వలయు విజయునట్లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి