శివయ్య కుటుంబము

సకుటంబ యుక్తుడై సానంద మందంచు
భక్తాళి కెల్లను భద్ర మొసగ
పరమేశు డంతట పార్వతీ మాతతో
ధరణికేతెంచెగా తడయకుండ
సింగంబు తానంత చిరునవ్వు చిందించ
నయనోత్సవంబుగానంది నవ్వె
స్కందాగ్రజుండంటసానంద మొనగూర్చ
గాంగేయు డంతట కామ్యమొసగ
ఆ.వే. రజిత పర్వతంబు రంజిల్లు నట్లుగా
దివిజ లోక మంత దీప్తి చెంద
కనులకిట్లు దోచె కైలాస గిరియంత
ఇంతకన్న కలదె యిహలోక సౌఖ్యంబు
జన్మ ధన్య మాయె జడత వీడి
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
[జన్మ ధన్య మగును జన్మంబు మరిలేక]

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత