మేకపోతు
ఒక మేక పోతు ప్రమాద వశాత్తు సింహం నివసించే గృహలో ప్రవేశించింది. సింహాన్ని చూచి బెదిరినా తమాయించుకొని సింహాన్ని ఇలా దబాయించి దానికి ముచ్చెమటలు పట్టించింది.
"అహ మేకశతం వ్యాఘ్రం
పంచవింశతి కుంజరః
ఏక సింహం న భక్ష్యామి
గడ్డం న వుపన ముచ్యతే"
అన్నదట.
ఇఃత వరకు నూరు పెద్ద పులలను చంపి తిన్నాను
ఇరవై యైదు ఏనుగులను చంపాను
ఇక ఒక సింహాన్ని చంపేశాక గడ్డం తీసేస్తాను అన్నదట. పాపం సింహం బెదరి పోయిందట.
మన కాశ్మీర్ వేర్పాటు వాదుల వైనం పాకిస్థాన పరిపాలకుల విషయం ఇలాగే యేడ్చింది.
తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురునా!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి