నన్ను ప్రభావితులు చేసిన గురువులు
నన్ను అత్యంత ప్రభావితం చేసినవారు తొలుదొల్త నా మాతృమూర్తి, బాల్యంలో బాలరామాయణం నేర్పించింది.తరువాత ఖడ్గమాల మహామంత్రాన్నిచ్చింది.కాబట్టి అమ్మతొలి గురువు.తరువాత బ్రహ్మోపదేశం చేసిన తండ్రి .అతనిని నుంచి బమ్మెర పోతన పై ప్రేమను పెంచుకొన్నాను.అధ్యాత్మికతపై కొన్ని ముఖ్యవిషయాలు గ్రహించాను.ఒక విధంగా చెప్పాలంటే వారివద్ద వుండడమే ఒక ఎడ్యుకేషన్.వారి వద్దనుంచి లేశ మాత్రమైనా అబ్బిందో లేదో అనుమానమే. ఒక విధంగా గొప్ప వారికి వారసుడుగా జన్మించడం కత్తిమీద సాము.పేరు ప్రఖ్యాతి సంపాదిస్తే తండ్రికి తగ్గ కొడుకు అనిసామాన్యమైన పేరు. ఆ స్థాయికి ఎదగడం పోతే "పండిత పుత్రుడు" అని నిందా గర్భమైన మాట.
తరువాత ఎలిమెంటరీ విద్య నేర్పించిన గురువులు గుర్తులేదు. తరువాత నాకు స్ఫూర్తినిచ్చిన విద్యాదాత నా ఆంగ్లో పాధ్యాయుడు శ్రీ బాలభీమప్ప .వీరు కేవలం ఆంగ్లం సోషియలేకాదు. ఆత్మన్యూనతా భావాన్ని తొలగించి స్పూర్తి కలిగించి రగిలించిన వ్యక్తి.నా పై అపారమైన ప్రేమాభిమానాలు చూపారు. ఆంగ్లంలో తగుమాత్రం అభినివేశం పట్టుకలిగించారు.తరువాత లెక్కలు మాష్టారు పుట్టబాకులు నరసింగరావుగారు, తరువాత నాకు అత్యంతయిష్టమైన సైన్స్ టీచర్లు నాగభూషణం సార్,(బయాలజీ,జువాలజీ,) తరువాత శ్రీవాదిరాజరావు ఫిజిక్స్ కెమిస్ట్రీ లు)నేర్పించారు, అది అంకితభావ ముతో .కేవలం సబ్జేక్ట్ మాత్రమే కాక నైతిక విలువలను బోధించారు.తరువాత చెన్నప్ప (సాంఘిక శాస్త్రం)
.ఇక తిరుపతి ప్రాచ్య కళాశాలలో పెద్ద పెద్ద ప్రముఖులే వున్నారు.
మానాన్న మిత్రులు డా!!కురిచేటి సోమయ్య గారి వద్దవుంటూ హైదరాబాద్ లో పండిట్ ట్రైనింగ్ పూర్తిచేశాను.ఆకాలంలో వారివద్ద ఆంగ్ల గ్రంధాలను ముఖ్యంగా Gospel of Rama Krishna రాజాజీ రామాయణ మహా భారతాలను చదివాను.అలా మానాన్న మిత్రులు సోమయ్యగారుపరోక్ష గురువయ్యారు.
1975నుంచి 1979వరకు నిరుద్యోగపర్వం అనంతపురం ఆర్ట్ కాలేజ్ లైబ్రరి గురువు.
తరువాత మానాన్న మిత్రులు డా|కుప్పావెంకట్రామశాస్త్రిగారు, 1979 మార్చి నుంచిGod Father అని చెప్పవచ్చు.నా మంచి చెడ్డలన్ని దగ్గరుండి చూచి నన్ను ఇంటివాడిని చేశారు. ఆది శంకరుల భగవద్గీత వ్యాఖ్యను పీఠికను పరిచయం చేశారు. స్వామి రంగనాథానందతో పరిచయ భాగ్యం కలిగింది వీరిద్వారానే.
స్వామి వివేకానంద రచనలను పరిచయం జరిగింది అప్పుడే.rebild India అనువాదం Swamy Ranganath nanda వారిhuman excellence అనువాదం అప్పుడే చేశాను.
1982 లో నవభారత ఉన్నత పాఠశాలలో విద్యాబోధన ప్రారంభించిన తరువాత ఒక కొత్త అధ్యాయం ప్రారంభం .స్వాధ్యాయ మొకప్రక్క విద్యాబోధన మరోవైపు కొనసాగింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి