జగమేలు తల్లి

జగమేలు తల్లికి  జేజేలు పలకండి
జగతిరక్షంబంత జరుపు తల్లి
పద్మావతీదేవి పర్యవేక్షించగా
లోటేమి యుండును లోకమందు
అమృతాభ్ధి వెడలి యవనికేతెంచి
అనురాగ మందించు నమ్ము వమ్మ
సకలసంపదలెల్ల సమకూర్చి కాపాడు
మమ్మేలు తల్లియే మాకుచాలు
కరుణాంతరంగుని కళ్యాణి వీవమ్మ
కరుణించి కాపడు కరుణ తోడ
ఆ.వే.నిన్ను నమ్మ జనుల నిరతంబు కాపాడు
తల్లి మనసు యనుచు తలపుకొచ్చు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత