ముసలితల్లి -,మోసపుకొడుకు
ముసలితల్లినిటుల మూర్ఖుడౌ పుత్రుండు
ఆదరింపకొదలె నాత తాయి
పుత్రుండు కాడోయి పుండువలెనుసల్పు
బాధయగునువీడు బంధువగునె
అమ్మనాన్నలనిన ననురాగమేలేని
చెదుపురగుకన్న చెడ్డవాడు
ప్రత్యక్ష దైవంబు ప్రథమైక పూజ్యయౌ
మాతృమూర్తినిటుల బాధ పెట్ట
ఆ.వే.కన్నతల్లి నిట్లు.కష్టముల్ పెట్టిన
పాప కర్మ చేత బాధ పడును
కర్మ ఫలము తానె కరువదీరునటుల
అనుభ వింప వలయు నార్తితోడ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి