ఆషాఢభూతులు

అరుదెంచినారోయియాషాఢభూతులు
వేషాలు మార్చేరు వేలరీతి
ఓట్లపండగరోజు వోట్రించి పలికేరు
శ్రీరాయజయరామశీవాయయంటారు
చిందులేవేసేరు సిగ్గువీడి
వీభూతిపూసెరు వీరభక్తలటుల
గంధాలుదిద్దేరు గంతులేసి
బోనాలు యెత్తేరు బోసినవ్వలురువ్వి
ఆ.వె.ఓటెయాగనింక వోటికుండలమాడ్కి
అల్పసంఖ్యలనుచుయాలపనము
కుక్కవాలమెంతకుదురుగానుండునో
వారివైఖరింతె వసుధలోన
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత