తదియగౌరమ్మ
తదియగౌరమ్మతో తనయుడొచ్చెనిచట
కౌలాసగిరినుండి.కదలి వచ్చె
అమ్మతో తనకెంత యనుబంధ ముండెనో
గౌరమ్మ యంకసీమ కదిలిరాడు
గరికపచ్చని చీర కనువిందు చేయగా
జగదంబు చిరునవ్వు చాల సొంపు
అభయముద్రను దాల్చి నాశిస్సులందించు
మోదకహస్తుడై మోద మొసగు
తల్లిబిడ్డలకిట్లు దండంబు నర్పించు
విశ్వంబు రక్షించ వినుతి చేతు
ఆ.వే.తల్లి తనుయులిట్లు ధరణి కేతెంచి
ధర్మ మార్గ మనుచు దారిచూపి
భద్ర పథము నందు బ్రతుకుడనుచు
వరము నొసగినారు వారు మనకు
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి