స్వారాజ్యము నా జన్మహక్కు
లాల్ -బాల్-పాల్ త్రయము స్వాతంత్ర్యసమరంలో అతిముఖ్యభూమిక నిర్వహించారు."స్వరాజ్యము నాజన్మహక్కు"అని నినదించిన లోకమాన్యబాలగంగాధర తిలక్ పుణ్యతిథి ఈరోజు. వారిని అప్పట్టి SSLC తెలుగు ఉపవాచకంలో వీరీగురించి పాఠం వుండేది.
తన కేసరీ మరటా పత్రికల ద్వారా బ్రిటీష్ ప్రభుత్వం దుర్మార్గ పాలన గురించి వ్యాసాలు వ్రాసేవారువారి .అణచివేత చర్యలను తూర్పార పెట్టేవారు.రాజకీయ సభలు సమావేశాలు నిషేధిస్తే సామాజిక గణపతినవరాత్ర ఉత్సవాలుపెద్ద పెట్టున నిర్వహించి అందులో స్వాతంత్య్రం కాంక్షను పరోక్షంగా నిర్వహించేవారు.అలా వారు మొదులు పెట్టిన గణపతినవరాత్ర ఉత్సవాలను స్వాతంత్ర్య సంగ్రామానికి వేదిక జేశారు.
రాజద్రోహనేరేల క్రింద బర్మాలోని మాండలే జైలులో కారగార శిక్షను విధించారు.భార్యమరణావస్థలో వున్న సమయంలో రాజకీయ ఉద్యమాల్లో పాల్గొనకుండావుంటే విడుదల చేస్తామని మభ్య పెడితే తిలక్ నిర్ద్వందంగా తిరస్కారించారు."మీరు పెద్ద జైలులో వున్నారు,నేను చిన్న జైలులో వున్నా"ను అని సమిధానంచెప్పారు.కారగారవాసశిక్షలో గీతారహస్య గ్రంధం రాసి భారతీయులకు కర్తవ్యదీక్షను నూరిపోశారు.
స్వాతంత్ర్యమొచ్చాక మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటని ప్రశ్నించిన విలేఖరికి, "భారతదేశం ప్రస్తుతం బానిసత్వం అనే అస్వాభివక స్థితిలో వున్నది, స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత గణిత ఆచార్యుడు గా వుంటాను"అని తనమనోభావాన్ని వ్యక్తపరిచారు.నేటి రాజకీయనాయకుల మనస్తత్వానికి తిలక్ కు నింగికి నేలకూ వున్నంత అంతరం వుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి