శ్రీనివాసుడు -ఆశ్రితమందారుడు

ఏదేశ మేగినా యెందుకాలిడినాను
నీవుందు వచ్చట నిక్కమోయి
మమ్మేలు మమ్మేలు మనుచును జనులెల్ల
వరుసకట్టుదురోయి వరుసగాను
భక్తజనులకెల్ల భవరోగ వైద్యుడై 
భజనామృతమంతను పంచి గాను
సర్వంబు నీలీల సంకల్పమేచాలు
ప్రత్యక్ష మగుదువు భక్తి కల్గ
ఆ.వే.జగతి కీవు పతివి జైజగన్నాథుడా
వందనాలు నీకు వసుమ తీశ
అందుకొనగ.వలయు నానంద నిలయుడా
వేల వంద నాలు వెంకటేశ
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత