మానవత్వదినమా--తద్దినమా?

మానవత్వ దినమా? తద్దిన మా?
-&-
మానవత్వదినమంత మంచిగా జరిగింది
మంచితనముకాస్త మంటగలిసె
మైనారిటీలంచుమైకము తలకెత్తె
మేజారిటిలకింక మేకులాయె
బలహీన వర్గాలు బంగారు బాతులు
బడగు బ్రతుకులంత బండలాయె
ఆరక్షణమనుచునందల మొక్కుట
అగ్రవర్ణమనుచునణచివేత
యతిజనులకెపుడుయాతనాలెప్పుడు
సంహారకాండలు సంఘటిల్లె
చదువురానిచవటసాగించు పాలన
చప్రాసిబ్రతుకాయె చదువరికిని
మారుమనసుపేర మతమార్పిడులుసాగు
హైందవ ధర్మమ్ము హీనమాయె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత