శ్రీరామకృష్ణ పరమహంస

కన్నతల్లివలెనుకాళికామాతను
అర్చించి మాట్లాడు నర్చు కుండు
తానుచూచుటెకాదు తనవారికెల్లును
భగవంతు చూపించు భక్తుడతడు
బ్రహ్మానుసంధాన పరమామృతమునంత
గురువుగాతానంత గుర్తుచేసె
సరళమౌ కథలతో పరతత్త్వమంతయు
పందారమట్లుగా పంచిపెట్టె
శ్రీ వివేకానంద శిష్యోత్తమునితాను
విశ్వానికందించె విమలచరీతు
జీవసేవచేయ శివుడుమెచ్చుననచు
ఆచరించిచూపె నధ్భుతమ్ము
పరమహంసమితడుబ్రహ్మానుభూతిని
యోగ్యవరులకిచ్చె యోగ్యతరసి
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత