వేదోక్త ధర్మము
వేదోక్త ధర్మాన్ని వెర్రివెధలెపుడు
దుంపతెంపుతలచుద్రోహులకట
శష్పసములయొక్క శాపోక్తులెపుడుడైన
నిష్ఫలములగుట నిజముకాదె
సత్యయుగమునుంచిసాపేక్ష శక్తితో
అసురసంఘటనమ్మునాశపడగ
గోబ్రాహ్మణలనెల్ల ఘోషపెట్టగబూని
మట్టికలయుకథ పిట్టకథయె
సంభవించునెపుడు సాక్షాత్ విష్ణువు
యుగయుగములనుంచియున్న కథయె
శిష్టరక్షణమునుదుష్టశిక్షణచేసి
ధర్మంబునిలుపగా నానచేసె
ఆ.వె.
అవతరింతురెపుడునవతారపురుషులు
వేదధర్మమంత వెల్లివిరియ
ఆటుపోటులెపుడునభ్ధిలోనుండుట
సహజధర్మమౌను జగతి యందు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి