కాళేశ్వరము

కాళేశ్వరుండంత కలికల్మషంబుల 
నడగింప తానంత నరుగుదెంచు
ముక్తేశ్వరుండంత ముక్తిపథముజూప
కైలాస గిరినుండి కదలివచ్చె
పానపట్టముపైన ప్రమదాధి పతియైన
పరమేశుడంతట భద్ర మొసగు
శివభక్తి యుతుడైన సిధ్ధించు సర్వంబు
కొరత లేదింకను కువలయాన
ఆ.వే.అమ్మనాన్న లట్లు నాదిదంపుతులిట్లు
కన్న బీడ్డ లట్లు కాచియుండ్రు
వారసేవ లోన వర్తిల్ల వలెనింక
ఇహముశపరము లెల్ల యింక దొరకు
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత