మతము-కుమతము

1మందు మార్చినట్లు మతము మార్చదగునె
మతము  మార జబ్బు మాయమగునె
కర్మవశత చేత కలుగవా రోగాలు
అనుభవింపకుండ యసలుపోవు
2 మతము మార కులము మాయమౌ పోవును
కులము పోయె ననచు కుమల వలదు
ఉన్నమతమె చాలు నుధ్ధరించునెపుడు
నాగరాజు మాట నమ్మమింక
శాస్త్రవేత్తలనేల్లనుచావగొట్టి
పాప పరిహార పత్రాల పంచిపెట్టి
భూమికేంద్రమనుచువీరు బూకరించి
కొత్తమార్గమనుచుచాల కోతకోసి
మతముకాదంచుయీరీతి మభ్యపెట్ట
మతముకాదుమాది మార్గమును మీరు
జంకులేకమీరు బొంకులాడ
నమ్మరెవరు మీదు నయవంచనంబును
గమ్యమేమిలేని గతుకుదారి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత