నిలకడున్నవాడు
|| వ్యవస్థితః ప్రశాన్తాత్మా
కుపితో ప్య భయంకరః
అవ్య వస్థిత చిత్తస్య
ప్రసాదోపి భయంకరః ||
|| నిలకడతో ఉన్న ప్రశాంతమైన కలవానికి కోపం వచ్చినా భయ పడవలసిన పనిలేదు
నిలకడ లేని మనస్సు కలవానికి అనుగ్రహం కలిగినా భయ పడాలి ||
అనువాదము:-----
నిలకడున్నవాడునిగ్రహమ్ముచూపినా
భయముగొల్పదెపుడు భయము లేదు
నిలకడేమిలేని నిప్పులుమియువాని
ప్రేమ కూడ మనకు భీతిగొలుపు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి