పంచాస్యుడు
స్మరియించినంతనే సాక్షాత్తు మోక్షాన్ని
అరుణాచలేశ్వరుడుందజేయు
కాశికానగరానకాయంబువదిలేయ
మోక్షసామ్రాజ్యంబు మ్రోలనుండు
శ్రీశైల శిఖరాన్ని స్థిరదృష్టితోచూడ
మరుజన్మ లేదింక మాటలేల
అధ్భుతంబైనట్టియాకాశలింగాన్ని
ఆత్మలో దర్శించు ననవరతము
పంచాస్యుడతడోయిపరతత్త్వమారీతి
ఆవిర్భవించిన యత్యుతుండు
పంచతత్త్వమయుడు బ్రహ్మమేతానైన
ఇహపరములిచ్చుయీశ్వరుండు
వేదమయుడు తాను వేదాంత వేద్యుండు
ముక్తి నొసగు స్వామి భక్తి నిచ్చు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి