తెలుగు తల్లి నొదిలి పరభాషపై మోజు
ఒకనాటి ప్రేమను నొలకబోసినయట్లు
పూనక మ్మంతగా పూని నట్లు
మాయమాటలతోడ మాటాడి మాటాడి
మరుసటి దినమంత మరిచి పోయి
ఆంధ్రభాషయనగ నాదమరిచి
డాడియమ్మలనుగ తాదాత్మమందుటె
తెలుగువారికిటుల తెగులు పుట్టు
ఆంగ్లపదములతోడ నంటకట్టకుండగా
తెలుగుపలుకుపల్క తేనెలూరు
తెలుగు వాడి వయ్యు తెలుగుమాధ్యము వీడి
పరుల పంచ చేర పధ్ధతేన
కన్న తల్లి నొదిలి కక్కుర్తి పడుటెల్ల
కాని పనియె యౌను కష్ట చరిత
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి