లోకమాన్యబాలగంగాధర తిలక్ స్మృత్యంజలి

స్వార్థమసలులేని సంగ్రామసింహమ్ము
స్వారాజ్యసిధ్ధికై సాహసించి
రవియస్తమించని రాక్షసరాజ్యాన్ని
కదలించివేసిన కర్మయోగి
గీతలోమర్మాన్ని తాత్పర్యమరసిన
తాత్వికుండైనట్టి తపసియతడు
జన్మహక్కైనట్టి స్వాతంత్ర్య మంత్రాన్ని
అందించెమనకంత యనవరతము
లోకమాన్యబిరుదు లోకానయితనికే
అర్హమైనిలిచిన యధ్భుతమ్ము
ఆ.వె.దేశభక్తియుతుడుధీశక్తిమంతుడు
భరతమాత సుతుడు పావనుండు
విఘ్నరాజుపూజవిఖ్యాతమొనరించి
స్పూర్తి మంతుడతడు సూనృతుండు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

(రచన --విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత