చాంచల్యజీవితం
చంచల చిత్తంబు చాంచల్య విత్తంబు
చిటికెలో మరణమ్ము చిత్రమిదియె కాలుడా కఠినుండు కారుణ్యమేలేదు
ధర్మంబు గతిచూడ త్వరిత మగును
దానంబు ధర్మంబు ధార్మిక వృత్తియే
మానుషధర్మంబు మరువకయ్య
పురుషార్థసాధనే పుణ్యంబు సమకూర్చు
మోక్షపథమునకు మంచిత్రోవ
మనుజ జన్మమంత మరలమరలరాదు
పూర్వపుణ్యమబ్బ పుట్టినావు
వ్యయముచేయబోకు వ్యర్థంబుగానీవు
మనుజ జన్మ నెపుడు మహినినీవు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి