దుర్గాదేవి
డొక్కచించవలయడోలుకట్టవలయు
మర్మమెరిగివీనిమట్టుపెట్ట
భక్తితో సురులెల్ల ప్రార్థనల్ చేయగా
మహిషునిటులతాను మట్టుపెట్టి
కదలివచ్చెనిటులకనకదుర్గయిలకు
దుష్టశిష్టణమందుశిష్టరక్షణమంత
నల్లేరుపైబండినడకకాదె
చిదగ్నికుండనాచిఛ్ఛక్తితానంత
దైవకార్యమనచుదిగ్గె నిట్లు
భక్తప్రియయనుచు భావనాగమ్యను
భక్తితో పిలిచిన బదులు పల్కు
ఆ.వె.అమ్మమనుసుయెపుడునార్ధ్రమైయుండగా
పిలిచినంత తాను పలుకు నెపుడు
భయముబాపిమనకభయమెసగనెపుడు
ముగ్ధభక్తికెపుడు మురియు నమ్ము
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి