తాలిబాన్ ఉగ్రవాదిని హతమార్చిన బాలిక
తాలిబాన్ ఉగ్రవాదులను తుదముట్టించిన
ఆఫ్ఘన్ బాలికకు ఆశిస్సులతో
----------_----_--------
గాంధార దేశాన ఖడ్గమాలయటుల
జనియించినట్లాయెజనులమదిని
అపరకాళికదేవి యవతరించెనటుల
తాలిబానులనెల్ల తాటదీయ
నిన్నుమెచ్చవలయు నిండైన మనసుతో
అబలయనెడిపల్కయనృతమాయె
తమలోనదాగున్న తత్త్వంబుతెలియక
బలహీన మనునట్టిభావమెల్ల
విడిచిపెట్టిన నాడు విజయంబు
సొంతమగుటంత సోత్కర్ష కాదమ్మా
ఆచరించి చూపిన యతివవైనావమ్మ
అభిజాత్యగుణమెల్ల యద్దంబురీతిగా
తార్కాణమైనట్టి తరుణివమ్మ
ఆ.వె.ఇట్టి బాలలెల్ల యిలలోన దుర్గలు
వీరవరులకెల్ల వెన్నుదన్ను
సప్తశతులలోని శక్తినంతయుకూడ
నీకు కలిగె నునుట నిక్కమాయె
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి