షణ్ముఖుడు

అగ్నిగర్భుచేత నజ్గానమంతరించు
జ్గానశక్తి నొసగి జ్గాత పరచు
సుభ్రమణ్యుచేత శుభముపడయవచ్చు
శరవణభవుడింక శరణమిచ్చు
బాహులేయడితడు భవ్యమౌ యోగమ్ము
భక్తజనులయాత్మ బంధువతడు
విజ్యయోసగునట్టి విద్యాస్వరూపుడు
శరణ్ణవానికి శరణమొసగు
విద్య కోరు వాని విద్వాంసు చేయును
జ్ఞాన మొసుగు మన్న జ్గాని చేయు
ధనము కోరువాని ధనవంతు చేయను
ఆదుకొనగ మనకు నాడ్యు డతడె
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత