ఆదిత్య హృదయం

ఆరోగ్యమొసగగా యాదిత్యుడుండగా
చింతపడగనేల చిన్నవాడ!
వందనాలతెలుప
 వరమిచ్చువేలుపు
దరహాస వదనుడై ధనము నొసగు
ఇహముపరములిచ్చు యీశ్వరుండితడయ్య
భాస్కరుండితడయ్యబాగుకోరు
పాడిపం టలనిచ్చి  భవితవ్యమొసగేటి
కశ్యప సూనుండు కర్మసాక్షి
ఆ.వే .అతడు లేక జగతి యణువంత సాగదు
అతడు యెపుడు మనకు నాప్తు డయ్య
మిత్రు డగుట.వలనె మైత్రిచూపునతడు
కమల బాంధ వుండు కనుము నీవు
(రచన:౼విద్వాన్ నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత