అమ్మానాన్నలు--ఆడబిడ్డ
అనురాగ మూర్తులౌ నమ్మనాన్నలెపుడు
నోములెన్నియొ వారు నోచిరకట
ఆల్లారు ముద్దుగా నపరంజిబొమ్మలా
కలలోని రాణిగా కాంచినారు
కష్టాలు పడ్డారు కన్నీరు త్రాగారు
ముద్దుమురిపాలతో మురిసినారు
మాపాపమాలక్ష్మి మాయమ్మ మాకూచి
గారాబు తల్లిగా.కాంచినారు
చదువుసంధ్యలునేర్పి సంసార్కమున్ మప్పి
కలలెన్నొ కన్నారు కన్నవారు
ఈడుజోడును చూచి యిష్టమున్.జూచియున్
తగినవరునిజూచి తడయకుండ
కళ్యాణమున్ జేయ కాంక్ష పడిరి
అమ్మ నాన్న లెపుడు ననురాగ మూర్తులే
వగపు చెందనీకు వారి నెపుడు
వలపు తలపు బోలు పలుపు తాడు
నమ్మబోకు వారి నయవంచనపు ప్రేమ
పెద్ద వారి మాట సద్ది మూట
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి