దేహము --దేహి

దేహాలు యెన్నైన దేహియొకడనుచు
తెలిసికొనుటంతతెలివి యౌను
అలలుయెన్నైనను నంభోధి యొకటంచు
సత్యమ్ము తెలియుటె సాధు వగును
సకలజీవలయందు సర్వాత్ము డుండగా
హింసించు తలపంత హీన మగును
కర్మాను బంధమే కారణంబనియంచు
వేదాలు శాస్త్రాలు వెల్లడించె
ఆ.వె.పూర్వకర్మ చేత పుణ్యంబు పాపంబు
అనుభవించ వలయు యయ్యలార!
జీవహింస లేని జీవనమ్మెమనకు
లక్ష్య మైన చాలు లక్ష లేల!
(విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత