సాకేత రాముడు- సముద్రము

సాగరమంతగా సాకేతరాముడు
గాంభీర్యమొప్పగా కానవచ్చు
ధైర్యగుణమునందు దాశరథిఘనుడు
హిమనగమంతగా యెత్తునుండు
ధృతిమంతుడతడు శృతిపారమెరుగు
సానందమొనగూర్చు సకల ప్రాణులకతడు
ప్రియదర్శనుండగా ప్రీతిజేయు
సత్యధర్మరతుడు సత్యసంకల్పుండు
ఆ.వె.రామభధ్రుడతడు రాజీవనేత్రుండ్రు
భక్తసులభుడతడు భద్రమొసగు
కోరినట్టివారి కొంగుబంగారమ్ము
ఇట్టిదైవమింక యిలనుగలడె
(రచన:-విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత