వాల్మీకికోకిల

వాల్మికి కోకిలవనశాఖి పైనెక్కి
రామరామయనుచు రాగ మెత్తె
మధురాక్షరంబైన మాధుర్యగీతమ్ము
అఖిలలోకంబంత యాలకించె
వాల్మీకి మునిసింహువర రామ నాదమ్ము
పరమపదమునిచ్చు భయము దీర్చు
రామకథాసుధ రసరమ్యమౌరీతి
కలకాలముండును ఖిలము గాక
అయ్యలెల్లరు రామయ్య లైరి జగతి
తల్లులెల్లరు సీతమ్మ తల్లులైరి
తమ్ములెల్లరు రామయ్య తమ్ములైరి 
వసుధ యంతయు రామయ్య వశము యయ్యె
(రచన .:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత