వేదవ్యాసుడు
విష్ణువే వ్యాసుడై వేదాలు విభజించి
ధర్మాన్ని నెలకొల్పె ధాత్రిలోన
బ్రహ్మసూత్రసమితి ప్రఖ్యాత మౌరీతి
వేదాంత తత్త్వాన్ని వేద్యపరిచె
పంచమ వేదాన్ని భవ్యమౌరీతిగా
ధర్మమార్గమునంత ధరకునొసగె
భక్తితత్త్వంబునుభాగవతధర్మాన్ని
భాగవతసుధను పంచెమనకు
తే.గీ.నాల్గుమొములు లేనట్టి నలువ యితడు
శంఖచక్రాలు లేనట్టి చక్రియితడు
ఫాలనేత్రంబు లేనట్టి భవడుయితడు
ఆరయ త్రైలోక్య వంద్యుడౌ వ్యాసుడితడు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి