గంగమ్మ
హరిపద పాద్యమై హరునిశిరమునెక్కి
దుండుకు దనముతో దుమికి దుమికి
ఉర్వళ్ళు పరవళ్ళు నుర్వికేలంచును
శిగలోన బంధించె శివుడుతానె
ప్రార్థించె పరమేశు భగిరథుండంతట
వెల్లువై వరదయై వెడలె గంగ
జహ్నుజన్నంబును జలములో ముంచేసి
జహ్నుకరుణచేత జాహ్నవైతి
జలధిలొన చేరిసగరపుత్రుల కెల్ల
ముక్తినొసగినట్టి పుణ్యరాశి
నిన్నుపొగడగలడె నీరజభవుడైన
నీకునీవె సాటి నిజము గంగ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి