వానప్రస్థం
వానప్రస్తమనుచు వాటమౌపేరుతో
అమ్మనాన్నలనెల్లనందువానప్రస్తమనుచు వాటమౌపేరుతో
అమ్మనాన్నలనెల్లనందునుంచి
ఏడాదికోరోజుయేగుదెంచగవచ్చు
ప్రేమంత కురిపించి బీదరపులరచి
మాయసేయగవచ్చు మంచిగాను
వృధ్ధాప్యమందున్న హృదయానికంతగ
ఆప్యాయమందించునదియెచాలు
తనయులనెల్లను తల్లియే పోషించు
అమ్మనుపోషించ నబ్బురమ్ము
వంతులేసుకొనుచు వత్సన్నములతోడ
తగువుపడినయట్టి తంతుచూడు
కులదీపకులంచుకూర్మితోపెంచగా
ఆస్తిపంపకమంచు యలుగు చుండ్రు
ఆ.వె
.అన్యదేశ్యమందునలవాటుకావచ్చు
భరత భూమిలోన పనికిరాదు
మహినిమానవుండు మాతృభక్తియుతుడు
ఆచరించవలయు యవనిలోన
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)నుంచి
ఏడాదికోరోజుయేగుదెంచగవచ్చు
ప్రేమంత కురిపించి బీదరపులరచి
మాయసేయగవచ్చు మంచిగాను
వృధ్ధాప్యమందున్న హృదయానికంతగ
ఆప్యాయమందించునదియెచాలు
తనయులనెల్లను తల్లియే పోషించు
అమ్మనుపోషించ నబ్బురమ్ము
వంతులేసుకొనుచు వత్సన్నములతోడ
తగువుపడినయట్టి తంతుచూడు
కులదీపకులంచుకూర్మితోపెంచగా
ఆస్తిపంపకమంచు యలుగు చుండ్రు
ఆ.వె
.అన్యదేశ్యమందునలవాటుకావచ్చు
భరత భూమిలోన పనికిరాదు
మహినిమానవుండు మాతృభక్తియుతుడు
ఆచరించవలయు యవనిలోన
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి