సర్ థామస్ మన్రో

మామంచిదొరవయ్య మన్రోల దొరవయ్య
మాసీమ కొచ్చిన మంచివాడ
గంజాయివనమున ఘనమైన తులసిలా
తెల్లదొర లందున తెల్ల హంస
రైత్వారిచట్టాన్ని రైతులకిచ్చిన
బంగారు మనసున్న బంధువయ్య
తెలుగుభాషను నేర్చి తెలుగులో మాట్లాడి
మామది గెలిచిన మంచివాడ
గురురాఘవేంద్రుల గురుకృపనంతయు
పూర్తిగా పొందిన పుణ్యచరిత
ఆ.వె.ఆప్తమిత్రుడీవునన్నదాతకెపుడు
మన్రొలప్పయనుచు మమతతోడ
పిలుచుచుందురెపుడు బిడ్డలు ప్రేమతో
మరువగలమెమేము మదినియెపుడు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత