భద్రాద్రి రాముడు
దశరథ పుత్రుండు ధర్మస్వరూపుడై
దాక్షిణ్య మూర్తియై ధరణివెలసె
కౌసల్య పుత్రుడై కోమలగాత్రుడై
కారుణ్యమూర్తియై ఖ్యాతిగాంచె
సౌమిత్రి యన్నయై సౌభాతృ భావంబు
ఇదియంచు తెలిపెగా యిలను మనకు
సీతమ్మ భర్తయై చిరకీర్తియుక్తుడై
కళ్యాణ రాముడై ఘనత కెక్కె
ఆ.వే.సత్య వాక్య రతుడు సర్వభూతహితుడు
మునుల హృదయమందు మెలగువాడు
కామితార్థ మొసగు కైవల్య మూర్తియై
భద్రగిరిని వెలసె భక్త తతికి
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి