కాలమహిమ

కపులెల్ల యొనగూడి కౌశల్య మొప్పగా
(సేతువు నిర్మించ్రి సీతకొరకు)
కార్యంబు నెరవెరే కాలమహిమ
శిలలెలెల్ల తేలెగాజలధిలో బెండ్లుగా
కానగ లేరయ్య కాలమహిమ 
మానవుల్ మొత్తిరి దానవ సంఘంబు
కాలంపు మహిమను కాంచ గలము
దశకంఠు చరితంబు తార్కాణ మగునయ్య 
పథము దప్పిన వాడు పతన మగును
ఆ.వే.
ప్రకృతి కూడ దుష్టు పరి మార్చ  దలచును
మంచి వారికెపుడు మాన్య తుండు
ధర్మరక్షసేయచేయ ధర్మంబు రక్షించు
సకల నీతి శాస్త్ర సారమిదియె
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత