కనకపర్వతమైన కదలిరాదు

కనకపర్వతమున్న కదలిరాదువెనుక
కర్మమొకటితప్ప కర్త వెనుక
పైడికుప్పకలదు పెద్దవాడిననచు
విర్రవెగుటెపుడు  వెఱ్ఱి తనము
రత్నరాసికొరకు జత్నము చేసిన
కాలహరణమౌను కలసిరాదు
ధనపురాశులుకూర్చి ధర్మంబు చేయక
బ్రతుకెంత బ్రతికిన భ్రమల బ్రతుకె
ఆ.వే.ధర్మ సత్రమట్లు ధరలోని బ్రతుకంత
గడువు ముగియగానె కదల వలయు
నిర్ణయించు నతని నిశ్చయమే ఘనము
నాగరాజు మాట నమ్ముమింక
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత