శాంతాకారం
శాంతమతనిరూపు సర్పంబు శయనమ్ము
పద్మనాభు డతడు పావనుండు
దివిజారి వర్గాన్ని దీటుగా నోడించి
సురరక్షచేసిన సుందరుండు
విశ్వంబు ధరియించి విశ్వంబు రక్షించు
విశ్విత్మకుండైన విష్ణు వతడు
గగనసాదృశ్యుండు గంభీర హృదయుండు
గానలోలుడితడు జ్ఞానమూర్తి
నీలాభ్రవర్ణుండు నిగమైక(నిగమాంత) వేద్యుండు
నీరజాక్షుడితడు నీతిశాలి
యోగీంద్ర హృదయుండు యోగీశుడితడయ్య
జ్ఞానైక గమ్యుండు జ్ఞాన మొసగు
సిరిలిచ్చు క్షీరాభ్ది పుత్రిని(కన్యను)
మనువాడి మమ్మేలు మాధవుండు
భవభయములనుండి భక్తాళి రక్షింప
వైకుంఠ వాసుడౌ విష్ణువితడె
శ్రీని వాసు కరుణ స్థిరముగా మనకుండ
భయములేదు మనకు భద్రమింక
కరుణ చూపు నతడు కరుణాసముద్రుండు
సప్త గిరుల స్వామి శరణ మింక
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి