డ్రాయింగ్ మాస్టర్ రిటైర్మెంట్

స్థిత ప్రజ్ఞు డితడయ్య చింతింప డెపుడైన
నిండు కుండవోలె నిశ్చలుండు
కార్యభారమనుచు కలహించడెపుడైన
తలలోని నాల్కగా తలతుమతని
కఠినోక్తి రానట్టి కర్మయోగి యతడు
మాయమాటలురాని మంచివాడు
విజయభాస్కరుండనుచు
విఖ్యాత నామఃబు
సార్థకంబగునట్టి సాధు వతడు
ఆ.వె.౹౹మనసులోని మాట మరివిప్పిచెప్పడు
చిత్ర రచన చేయు చిత్ర రథుడు
అతని వలన కాదె నధ్భుతంబౌరీతి
వినుతి కెక్కినాము విజయ మంది

ఆ.వే.‌౺౹అతని చేయి పడక నావంత పనియైన
కదల దెపుడు మాకు కొంచ మైన
వార్షి కోత్స వాల వైభవా లన్నియు
ఇతని చేయిలేక యిమడ వసలు

బాలలందు కలుగు భావంబులకు నెల్ల
చిత్ర రూపమిచ్చు చేయి యితడె
విలువ కలుగు సులువు విభుదుడై యిచ్చును
మాయ నెరగ నట్టి మర్మ.యోగి

కోప మెరుగ నట్టి కోమల హృదయుండు
మంచి మనసు కితడు మచ్చు తునక
పరుల మేలు కోరు పావన శీలుండు
విజయ భాస్క రుండు విజయడెపుడు

పదవి విరమణంబు పాటించి  నావయ్య
కళను సృష్టి చేయు కాలమొఛ్చె
సృజన శీల మొప్ప సృష్టించు నీవింక
కలసి వచ్చె నీకు కాలమిట్లు
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼బుధ జన విధేయలు
నవభారత్ ఉన్నత పాఠశాల అధ్యాపక బృందము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత