33సంవత్సరాల ఉద్యోగ పర్వం
ఉద్యోగ తృప్తి (job satisfaction) నీకు లభించిందా? అంటే , 💯/💯 పాళ్ళు లభించిందనే చెప్పాలి.ఎందుకంటె 1075 నుంచీ 1982 వరకు నిరుద్యోగ పర్వం లో వున్నాను కాబట్టీ ఎడారిలో ఒయాసిస్సు లభించినట్లైంది.అందుకే వేరే వుద్యోగ ప్రయత్నం చేయలేదు.
నన్నయ్య భట్టు నుంచీ తెలుగు కవుల్లో చాలామందిని విద్యార్థులకు పరిచయం చేయగలిగాను. ముఖ్యంగా విద్యార్థులు పద్యభాగాన్నే వినడానికి చదవడానికి ఎక్కువ అభిలాషిస్తారు
నన్నయ నానారుచిరార్థ సూక్తినిధిత్వం, అక్షర రమ్యత,కథాకలితార్థయుక్తి, విద్యార్థులకు పరిచయం చేసే అవకాశం కలిగింది, తెలుగు వ్యాకరణాన్ని సంస్కృతంలోరాసిన "ఆంధ్రశబ్దచింతమణి"ముచ్చట్లు చెప్పితే విద్యార్థులు ఆశ్చర్యపోయేవారు, తిక్కనసోమయాజి నాటకీయ పద్యరచన,అతని ఉభయకవిమిత్రత్వం, వివరించే అవకాశం ద్రౌపదీ నివేదన, రాయభారఘట్టాల్లో లభించింది.విద్యార్థులు ఎంతో శ్రద్ధగా దీక్షగా వినేవారు, ద్రౌపదీ దేవి ఏకపాత్రాభినయం చేయించలేదనే కొరత మిగిలింది.
ఇక శంభుదాసుడు ప్రభంద పరమేశ్వరుని అరణ్యపర్వశేష పూరణను వివరించి, వర్ణలను ఎంతగొప్పగా చేశాడో ,తరువాత కవులకు మార్గదర్శకుడయ్యాడో "జడివాన" పాఠం అవకాశం కలిగించింది.
పాల్కురికి సోమనాథుని వీరశైవ వాజ్మయం లోని బసవపురాణం పండితారాధ్య చరిత్రలను వివరించే పాఠాలను మరిచిపోతే యెలా? ద్విపద పద్యం ఎంత సులభంగా రాయవచ్చో వివరించాను
ఇక సహజకవి సహజపాండితుడైన బమ్మెరపోతనామాత్యుని సహజసుందరమైన జీవితం, అతని మాధుర్యభరితమైన పద్యరచనా గురించి వర్ణించడం ఎవరి తరము.? ఎన్నిపిరియడులు చెప్పినా తనివి తీరదు.పాఠం మధ్యలో బెల్లు కొడితే విద్యార్థులు అసంతృప్తి పడి బెల్లును తిట్టెవారు. ముఖ్యంగా 7వతరగతి. విద్యార్థులకు " ఓ యమ్మ నీకుమారుడు " మొదులైన బాలలీలలు పోతన వర్ణించిన తీరు ఆకట్టుకొనేది
8వతగతిలోన మా పిల్లలు బాలకృష్ణునితోడ గోపకులతో చల్దులారగించిన యనుభూతిని సొంతం చేసుకొన్నారు.10 వతరగతికి వచ్చేసరికి బలిచక్రవర్తి తో పాటు
""కాలే రాజులు రాజ్యముల్గలుగవే "అంటుగొంతుకలిపి, మాట తిరుగులేని మానధనులయ్యారు.
పనిలో పనిగా బమ్మెర పోతనామత్యుని నిరాడంబర జీవనశైలి, బ్రహ్మీ దుత్త వరప్రసాద లభ్డుడూకవిసార్వభౌముడైన
శ్రీనాథమహకవి విలాసవంతమైన
జీవితాన్ని తెలుసుకొన్నారు.
శ్రీనాథమహాకవి చివిరి రోజుల గురించి
తెలుసుకొని అతడు అమరిపురికేగు
సందర్భములో చూపిన గాంభీర్యం మునకు ధీరత్వానికి ముగ్ధులయ్యారు
తరువాతి కృష్ణదేరాయల ఆస్థాన కవులు అల్లసాని పెద్దన(ఇందీవరాక్షుని వృత్తాంతము9వతరగతి),ధూర్జటి శతకపద్యాలను పాఠ్య భాగం బోధన సందర్భంగా సందర్భంగా వివరించడం వారిని ఆకర్షించింది. ముఖ్యంగా "అటజనికాంచె భూమిసురుడంబరచుంబి------శీతశైలమున్ "పద్యం ,ఆ పద్యధారా భాగనచ్చినది.శ్రీకాళహస్తి లోని వాయిలింగ ప్రశస్తి వివరించి శివుని లింగాకారములోనే ఎందుకు పూజించాలో తెలిపి వారి ఉత్సుకతను తృప్తి పరిచాను.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి