శ్రీరామకృష్ణ పరమహంస
చంచలమ్ము ధనము చంచలమాయువు
సంసార మంతయు చంచలమ్ము
చంచలపు బ్రతుకు సర్వమ్ము చంచల
ధర్మమెకటెనిల్చు ధరణి పైన
ఆచరించవలయునత్యంత నిష్టతో
అదియెననుగమించు నంతమందు
ఎంతయేడ్చిననేమి యేమివరగునోయి
మంచిచెడ్డలోకటె మనకుతోడు
ఆ.వె.కఠిన సత్యమిదియె కంగారు పడకోయి
ఉన్న మాటయిదియెనుర్విలోన
మాయతెరను ద్రుంచ మర్మంబు కనిపించు
నాగరాజు మాట నమ్ము మింక
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి