మా అత్తగారు

Ofఈమధ్య నే మా మామగారిని పరిచయం చేసా! ఈ రోజు మా అత్తను పరిచయం చేస్తున్నాను.
నేను  మామేనత్తలను(, మానాన్న వైపు) చూడలేదు లేదు.ఒక అత్త మాత్రం లీలగా గుర్తు.
ఆ లోటును మా అత్త 💯 పూర్తిచేసింది. అత్త గారు అని నేను పిలిచే వాడిని కాదు.అలానే అల్లుడుగారు అని  సంభోదించే వారు కారు. ఇలాంటి ప్రోటోకాల్ మర్యాదలు మా మధ్యలో లేవు.అత్తా! అని నేను పిలిస్తే,నాగరాజూ! అని నన్ను  వాళ్ళబ్బాయిలా ప్రేమ ఆప్యాయతలతో  పిలిచేవారు.
మానాన్న,అమ్మ స్వర్గస్తులైన తరువాత నాకు పెద్ద దిక్కుగా భావించేవాడిని, నాతోడల్లుడు శ్రీ వెంకటేశ్వర శాస్త్రి గారు ఇలానే భావించేవారు.
రెండువందల జీతంతో ఉద్యోగం ప్రారంభించినా చిన్న బుచ్చిందిలేదు ,తెలుగు పండితునిగా గౌరవ నీయమైన వృత్తిలో వుంటూ సన్మానాలు,సత్కారాలు పొందినప్పుడు మెచ్చి మేకతోలు కప్పలేదు.ప్రత్యక్షంగా ప్రశంసిస్తే ఆయుఃక్షీణమనే భావన కావచ్చు.బంధువుల్లో చూట్టాల్లో బాగా ప్రశంసించే వారిని వినికిడి.సన్మానాలు జరిగినప్పుడు దిష్టితీయాలంటూ పట్టు బట్టేది. సభలకు సమావేశాలకు వూర్లకు వెళ్ళెటప్పుడు తప్పకుండా నమస్కరించేవాడిని.(పండుగలప్పుడు కొత్తబట్టలు వేసుకొన్నప్పుడు)  ఇల్లు సండడిగా వుండేది మా అత్తగారు ఉంటే.నా శ్రీమతి కి ఓపెన్ హార్ట్ ఆపేరేషన్ కుముందు కొన్ని నెలలు తరువాత మా అత్తగారు నావద్దనే వుంటూ నాకు పాఠశాల కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం కలిగించకుండా కాలనియమము ప్రకారము ఆ పెద్దవయసులో నిర్వహించేవారు. విసుగు కోపము వచ్చేది కాదు. తీరిగ్గా ఊర్మిళా దేవినిద్ర,లక్ష్మణదేవర నవ్వు,కుశలాయకాలు పాడుకొంటు వుండేవారు‌.7 వతరగతి లో ఊర్మిళా దేవినిద్ర పాఠానికి మా అత్తగారి వద్దే ట్యూన్ నేరర్చుకొన్నాను. నేను టెన్ట్ పరీక్షల స్పాట్ వ్యాలూషన్ కు వెళ్ళినప్పుడు నా శిష్యులు(నాగేంద్ర,రమేష్ లు) తోడుండేవారు.
తూర్పు గుమ్మానికి ఎదురుగా నిత్యవిధి దేవతార్చనలు చేసుకొనే కాలంలో కాయగూరలు తరుగుతూ వుండేవారు.
నా యింటి నిర్మాణం సూపర్ వైజరీ కార్యక్రమం నిర్వహించినట్లు గుర్తు.
1998లో నా శ్రీమతికి విశాఖపట్నంలో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగాక ,నా శ్రీమతికి చేదోడు వాదోడుగా వుండడానికి నిశ్చయించుకోని మా వద్దనే వుండి పోయినది. అలా నాకు ఒక పెద్ద దిక్కులా కొండంత అండలా వున్నారు.
కన్నాడా డి.డి.చందన లో ప్రతిరోజు ఉదయం గంలకు 5-30 పురాతన ఆలయాల్లో జరిగే విశేష పూజలను అభిషేకాలను చూచేవారు. ఆలస్యమైతే అభిషేకం పెట్ఠ లేదనేవారు.
అష్టాచమ్మా, చాలా యిష్టమైన ఆట, కలకండ్(గోధుమరంగు)  యిష్టం పడేవారు.
అత్తిల్లు పుట్టిల్లు బందరే(మచిలీపట్నమే)  పూర్వజన్మాను బంధము నా అత్తను  పాల్వంచలోనే నావద్ద తీసుకువచ్ఛిందనుకొంట. సకృత్తుగా కోపం వచ్చేది.అది తాటాకు మంటే. బందరు లడ్డు, బొబ్బట్లు స్పెషలిష్టు.నభూతో నభవిష్యత్తుగా వుండేవి. దొడ్డన పూడి మేనల్లుడు భోగీశ్వరం అంటే చాలా ప్రేమ. తన మనముణ్ణి చిన్న వాడు,చిన్న వాడు చిన్నవాడు అంటూ గారాబం చేసేది‌.హైదరాబాదు నుంచి తరుచుగా పాల్వంచకు వచ్చేవాడు.ముఖమంతా వికసించేది.
తనకో వూతపదం " మంచిది" అది సందర్భాను సారంగా,ప్రశంస,తిరస్కారం, అవహేళనలు ఇవన్ని ధ్వనించేవి‌.
సాయంకాలం నన్ను గడపడాటి బయటికి వెళ్ళనిచ్చేది కాదు .అథవా బయటికి వెళితే తిరిగి వచ్చేవరకు ఆరాటమే.
ఇలా రోజులు,వారాలు నెలలు,సంవత్సరాలుగడిచాయి.
ప్రతి దానికి ఆరంభము వున్నట్లే ముగింపు వుండడము సహజము.వృధ్ధత్వం, వయోభారము వల్ల మంచానికే అంటుకుపోయింది చివర్లో.చుట్టాలు పక్కాలు (తనపుట్టింటివారు) వచ్చారు, వెళ్ళారు. మేనల్లుడు "అబ్బి అత్తతో "బందరుకు వెళతావా? " అన్న ప్రశ్న కు చిగురుటాకులా వణికిపోయి "నాగారాజు సీత పంపించమన్నారా? అన్నది.అంత కటువైన మాట వినవలసిరావడంకష్టమే. మా ఆలుమగలిద్దరికీ ఆమాట బాకుపోటులాంటిదే. షేక్స్పియర్ జూలియస్ సీజర్ నాటకంలో  (it is most unkindest cut up all)"ఇది  తీవ్రమైన నిర్దయతో కూడిన గాయం" లా ధ్వనించింది‌. దైవ వశాత్తు మా యిద్దరికీ ఆ భావం లేనందువల్ల ఆవిషయాన్ని పట్టించు కోలేదు.
వయోభారం అనారోగ్యం బాధించడంవల్ల క్రమక్రమంగా ఆరోగ్యం సన్నిగిల్లినది‌.వైద్య చికిత్స చేయించిన లాభము లేకపోయింది.
హైదరాబాద్ ల లో ఇదే జూన్ నెలలో బావమరది కుమార్తెకు,తోడల్లుని కుమారునకు నిశ్చయతాంబూలాలు ఘనంగా వేడుకగా జరిగాయి. ఆరోజు మధ్యాహ్నమే 3--30 గం.లకు మా అత్త ఆ ఆనందకర దృశ్యాన్ని తన మనో నేత్రంతో తిలకించిందనుకొంట.ఆ సంతోషముతో దివంగతురాలైనదని నిభావన. నిశ్చయతాంబూల కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలగలేదంటే మా అత్తగారి మనోసంకల్పమే కారణమనుకొంట.
మిగిలినకార్యక్రమాలు యథావిధిగా జరిగాయి. కాలం ఎవరికొరకోఆగదుకదా!
చివరకు మా అత్తను పితృవనంలో( స్మశానము అనడం నాకిష్టములేదు) ఒంటరిగా దిగబిట్టి వచ్చానని దిగులు దుఃఖం కలిగింది.
ఒక తరం  నా కనులముందు కదిలి పోయింది.పోయినోళ్ళందరు మంచీవారే.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత