ధర్మమార్గము

మూల శ్లోకము 
"అస్థిరేణ శరీరేణ యో~~స్థిరైశ్చ రైశ్చ ధనాదిభిః
సంచితోపి స్థిరం ధర్మం సయేకో బుధ్ధిమాన్నరః
తస్మాత్ సర్వప్రయత్నేన
కర్తవ్యో ధర్మసంగ్రహః
-------------
ఆంధ్రీకరణము
--------------------
కాయమాక్షిణికమ్ము కాలమాయాగదు
పదవేమొ యక్కటా! పరులు పాలు
పరువంబునిలవదు పదికాలాలపాటు
రోగాలు రొష్టులు రోదనాలె
ఆలుబిడ్డలెప్పుడునంటకాగరు నిన్ను
చుట్టాలు తిన్నగా చూడరకట!
నమ్మిన నీవారు నట్టేట ముంచగా
కాలంబుకొరకునై కాచినారు
ధర్మమెక్కటెనిన్నుదయతోడ రక్షించు
కంటిరెప్పవలెను కాచు నిన్ను
ఆ.వె బుధ్ధికలిగినీవు ముక్తిమార్గంబున
సాగవలయునీవు యాగకుండ
ఆర్ష ధర్మమిదియె యాచరింపవలయు
ధర్మ మార్గమిదియె నరులకెల్ల

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత