అర్ధనారీశ్వత్వము
అర్ధనారీశ్వరులపరూప చిత్రమ్ము
అసదృశమైనట్టి యధ్భుతమ్ము
జగతిలో నీరీతి చాతుర్య రచనమ్ము
కన్పట్టు మనకంత కావ్యమందు
కాళిదాసుమదిని కాంచినాడేమోను
భావించి నేమోను భాగ్యమట్లు
ఆధ్యాత్మ తత్త్వమే యాధార భూతమై
సాగించినట్టిదౌ శాస్త్ర మిదియె
నందీశు పైచేయి నగజాత కలశమ్ము
అర్ధనారీశ్వర యద్వైత తత్త్వంబు
కన్నుల ముందర కాంచ గలము
ఆ.వె.పాలలోని తెలుపు భాసిల్లునట్లుగా
వెలుగులోననున్న వేడిమట్లు
సూర్యునందు రశ్మి సుందరతరమట్లు
అమ్మలోన కనుము నయ్యనెపుడు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి