చదువులమ్మకరుణ

చదవులమ్మకరుణ శారదాంబకృపయె
ఆత్మవిద్యనొసగు నమృతమట్లు
భారతీ దేవియై భాసింప చేయును
పరతత్వమంతయు బాగుగాను
మంచేదొ చెడ్డెదో మదమరాళమటుల
విభజించు నేర్పేదో వివర పరచు
వాణియే మాకిచ్చు వాక్సుధారసమును
భావంబు తెలుపగా భాషగాను
ఆ.వే.కావ్య రచన చేయ కరుణించ వలెనమ్మ
రాగ తాళ భావ లయల నిచ్చి
సామ వేద మంత స్వాధీన పరచగా
అమ్మ దయను వేడ యన్ని యొసగు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి,)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత